కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 15 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ 16 తె. 3.07 కు తదుపరి పాడ్యమి 16 రా. 1.09 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: భరణి రా. 10.37 కు తదుపరి కృత్తిక 16 రా. 9.17 కు
యోగం: వ్యతీపాత ఉ. 07.30 కు తదుపరి వరీయాన్ రా. 03.33 కు
కరణం: విష్టి మ. 04.37 కు తదుపరి బవ రా. 02.58 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.37 - 09.22 కు & మ. 12.23 - 01.09 కు
వర్జ్యం: ఉ. 9.07-10.37 కు
అమృతకాలం: సా. 6.02 - 7.32 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు
🕉️ కార్తిక పూర్ణిమ, జ్వాలాతోరణం, చంద్ర జయంతి 🕉️
గురుబోధ:
🕉️జీవితంలో ఒక్కసారైనా జ్వాలాతోరణం దాటాలి అని వేదవాక్కు. బిల్వములతో ఈశ్వరునికి చేసే పూజాఫలం ఇంత అని చెప్పలేనిది.
🕉️శివకేశవులు భూమికి దగ్గరగా ఉండి దీవించే మాసం ఇది. కార్తికస్నానం, జపములు, దానాలు ప్రతిరోజూ చేయాలి.
🕉️కార్తికపూర్ణిమ నాడు ప్రతి ఆలయం ముందు జ్వాలాతోరణ (జ్వాలను తోరణంగా కట్టడం) ఉత్సవం జరపడం సంప్రదాయం. రెండు కఱ్ఱ స్తంభములు నిలువుగా పాతి, అడ్డంగా మరొక కఱ్ఱని కట్టి, దానికి గడ్డిచుట్టి, నెయ్యి వేసి, నిప్పు పెడతారు. ఆలయ ఉత్సవమూర్తులతో పాటు తోరణం మధ్యలో నడుస్తారు. జ్వాలాతోరణంలో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని, అగ్నిబాధలు ఉండవని, పునర్జన్మ ఉండదని, అప్పటివరకు చేసిన పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని శాస్త్రం.
🕉️ఎన్నో జన్మల సంస్కారం ఉంటే గాని పరమపవిత్రమైన కార్తికపూర్ణిమను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన రాదు. ముఖ్యంగా దీపం వెలిగించడం, దానం చేయడం, ఆలయ దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ, నదీస్నానం లేదా పురాణం వినడం వంటివి ఏవో ఒకటి తప్పక చేయాలి.