"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 15 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము
తిథి : విదియ మ. 01గం౹౹51ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : జ్యేష్ఠ తె. 04గం౹౹08ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : అతిగండ మ. 12గం౹౹08ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం : కౌలవ మ. 01గం౹౹47ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹22ని౹౹ నుండి 12గం౹౹07ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹53ని౹౹ నుండి 11గం౹౹28ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹24ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹07ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹23ని౹౹కు
🕉️ కార్తిక శుద్ధ విదియ - యమవిదియ, భగినీహస్తభోజనం, అన్నాచెల్లెళ్ళ పండుగ🕉️
గురుబోధ
1) కార్తికమాసంలో రావిచెట్టుకు, వేపచెట్టుకు ప్రదక్షిణలు చేయడం మంచిది. ఆలయములో స్థంభముల వద్ద, ఇతర విగ్రహాల దగ్గర, చెట్టుకు కొంత దూరంగా మాత్రమే దీపం వెలిగించాలి. ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం మరింత శ్రేష్ఠము.
2) దీపం వెలిగించేప్పుడు ఒక్క కొబ్బరినూనె తప్ప మిగిలిన నూనెలు ఉపయోగించవచ్చు. ఏ నూనెలో అయినా కొంత ఆవునెయ్యి వేయటం ద్వారా అది శ్రేష్ఠమవుతుంది.
3) పంచామృతాలతో అభిషేకం, బిల్వములతో కార్తికశుద్ధవిదియ రోజున చేసే పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది.
4) కలియుగంలో పార్థివలింగ పూజ అనేక శుభఫలితాలను ప్రసాదిస్తుంది. కోటి యజ్ఞములను, అనేక దానములు చేస్తే వచ్చే మహాఫలితం పార్థివలింగ పూజతో లభిస్తుంది. విశేష లక్ష్మీ అనుగ్రహం పొంది, డబ్బులు బాగా సంపాదించాలంటే పార్థివలింగాన్ని పూజించాలి.
విశేష లక్ష్మీ అనుగ్రహం ప్రసాదించి, డబ్బులు బాగా సంపాదించేలా చేసి, భుక్తిముక్తులను అందించే పార్థివలింగ వైశిష్ట్యం👇
విభూతి మహిమ👇