Nov 14 2023నవంబరు 14 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 14 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : పాడ్యమి  మ. 02గం౹౹23ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : అనూరాధ తె. 04గం౹౹20ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : శోభన మ. 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం :  బవ మ. 02గం౹౹36ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు & రా. 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 08గం౹౹01ని౹౹ నుండి 09గం౹౹38ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹46ని౹౹ నుండి 07గం౹౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹07ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹24ని౹౹కు

🕉️ శివకేశవ ప్రీతికరమైన పరమపవిత్ర కార్తికమాసం ప్రారంభం🕉️ 

గురుబోధ
కార్తికమాసం పరమపవిత్రమైనది. “న కార్తిక సమో మాసః” అని వ్యాసుని వాక్కు. కార్తిక మాసానికి సాటివచ్చే మాసం లేదని దీనికి అర్థం. ఇంత గొప్ప మాసంలో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణకథాశ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రాలు చెపుతున్నాయి.
ఈ మాసములో నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండడం చాలా మంచిది. రాత్రి నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేస్తే నక్త వ్రతం అంటారు. నెల నాళ్ళు నక్తవ్రత ఆచరణ చేయలేని వారు కనీసం సోమవారం అయినా సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఆలయం దర్శించుకోవాలి. కార్తికమాసంలో చేసే ఆలయ ప్రదక్షిణ చాలా గొప్ప పుణ్యం ఇస్తుంది.
కార్తికమాసంలో ఒక్కరోజైనా దీపం వెలిగించి దీపదానం చేసేవారు స్వర్గానికి వెడతారు. దీపదానానికి మించిన దానం, వ్రతం, దాని వల్ల వచ్చే ఫలం ఇంతకు పూర్వం లేదు, ఉండబోదు.
కార్తికమాసం మెుత్తం దీపములు వెలిగించినా , లేక దానాలు చేసినా, ఆయువు పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ధనం, ధాన్యం, పుత్రసంతానం కలుగుతాయి. 
కార్తికమాసంలో దీపాన్ని వెలిగించడమే దీపదానం క్రింద లెక్కకు వస్తుంది. ఇక వెలుగుతున్న దీపాన్ని దక్షిణతో పాటుగా విప్రునికి దానంచేస్తే వచ్చే ఫలితం వర్ణించడానికి వీలు కానిదని నారదపురాణం చెపుతున్నది.

శివలింగార్చన, శివలింగ పూజా విధానం, ఫలితాలు👇



శివనామ మంత్రజప ఫలితం👇


expand_less