Nov 13 2024నవంబరు 13 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 13 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం

తిథి: ద్వాదశి ఉ. 10.02 కు తదుపరి త్రయోదశి 14 ఉ. 7.33 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రేవతి రా. 1.44 కు తదుపరి అశ్విని 14 రా. 12.07 కు
యోగం: వజ్ర మ. 03.26 కు తదుపరి సిద్ధి 14 ఉ. 11.30 కు
కరణం: బాలవ మ. 01.01 కు తదుపరి కౌలవ రా. 11.23 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.38 - 12.23 కు
వర్జ్యం: మ. 2.35 - 4.04 కు
అమృతకాలం: రా. 11.31 - 1.00 కు
సూర్యోదయం: ఉ. 6.20 కు
సూర్యాస్తమయం: సా. 5.41 కు

🕉️ కార్తిక శుద్ధ ద్వాదశి - క్షీరాబ్ధి ద్వాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం 10 గం.ల లోపే చేయాలి.

https://youtu.be/Qj784Qm9zjA?si=WGUTyhv3oAWgnw1_

గురుబోధ:
కార్తిక మాసంలో ఈ ఉత్థానద్వాదశి రోజున శ్రీహరి నిద్ర లేస్తాడు. ఈరోజు ఉదయం 4 గంటలకు లేదా ముందే లేచి కార్తిక స్నానం చేయడం మంచిది. ఇంట్లోనే స్నానం చేసే వారు ఆవుపాలు కొంచెం వేసి గంగాజలంతో స్నానం చేస్తున్న సంకల్పం చెప్పుకోవాలి.
ఈ రోజు చేసే గోదానం మరింత మంచిది. స్వయంపాకం ఒక్కరు లేదా ముగ్గురు లేదా ఐదుగురికి ఇవ్వడం మంచిది. గురువులకు పాదసేవ చేసినా, గురువు పాదాలు కడిగిన నీటిని నెత్తిన చల్లుకుంటే అది విష్ణుపాదోదకముతో సమానం.

expand_less