Nov 13 2023నవంబరు 13 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 13 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : అమావాస్య  మ. 02గం౹౹23ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : విశాఖ తె. 03గం౹౹58ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : సౌభాగ్య మ. 03గం౹౹23ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం :  నాగ మ. 02గం౹౹56ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు & మ. 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 08గం౹౹59ని౹౹ నుండి 10గం౹౹38ని౹౹ వరకు
అమృతకాలం : రా. 06గం౹౹53ని౹౹ నుండి 08గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹06ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹24ని౹౹కు

🕉️ సోమవతీ అమావాస్య, కేదారవ్రతం🕉️ 

గురుబోధ
•	పూర్ణిమ, అమావాస్య  మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
•	తనకు తోచినప్పుడల్లా అనేక పార్ధివలింగాలని తయారుచేసుకుని, వీలున్నప్పుడల్లా అర్చన చేసేవాడు, అందులో ముఖ్యంగా సోమవారం కానీ, చతుర్దశి నాడు కానీ, మాస శివరాత్రి కానీ, అష్టమినాడు కానీ, శివరాత్రి కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్కపెట్టకుండా తోచినన్ని పార్ధివలింగాలని చేసి పూజించువాడు ముక్తి పొంది తీరుతాడు. నాకు భూమి కావాలి, కాస్త స్థలమో, పొలమో కావాలి అనుకున్నవాడు వెయ్యి పార్ధివలింగాలని భక్తితో పూజించినవాడు, అభిషేకించినవాడు తప్పక భూమిని పొందుతాడు. శివానుగ్రహం ఒకటే కావాలనుకున్న వాడు, పరమేశ్వరుని యెుక్క కరుణ కావాలనుకున్న వాడు, 3000 పార్ధివలింగాలని అభిషేకం చేసుకోవాలి. అభిషేకాలు, అర్చనలు ఇంట్లో కంటే  గుడిలో, గుడిలో కంటే తీర్ధ స్థలాలలో, నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అదే గంగానదీ తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాశీ వంటి దివ్య క్షేత్రాలలో గంగాతీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది. ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. శివుడు అవ్యాజకరుణామూర్తి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, అభిషేకము చేయడానికి పంచామృతాలు లేవు, అప్పుడు కొన్ని నీళ్లు జల్లినా సంతోషిస్తాడు. - శ్రీ శివమహాపురాణం

భృగుకృత శ్రీ శివస్తోత్రం👇


శివకవచం👇


శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం)👇


expand_less