" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 13 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి : పంచమి రాత్రి 10గం౹౹04ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : భానువారం (అదివారం) నక్షత్రం : ఆరుద్ర ఈ రోజు ఉదయం 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : సాధ్య ఈ రోజు రాత్రి 10గం౹౹51ని౹౹ వరకు తదుపరి కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 11గం౹౹37ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹55ని౹౹ నుండి 04గం౹౹40ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 10గం౹౹13ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు అమృతకాలం : లేదు సూర్యోదయం : ఉదయం 06గం౹౹06ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹24ని౹౹ గురుబోధ మతిమరుపు ఉన్న వారికి మళ్ళీ జ్ఞాపకశక్తి వచ్చి తెలివితేటలు పెరగాలి అంటే ప్రతి రోజు శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. చెంబుడు పాలతో, బిందెడు పాలతో లేక పంచపాత్రలో పోసిన పాలతో అభిషేకించి, అభిషేకించగా వచ్చిన ధారను ఒక పాత్రలో పట్టుకుని పూజ అయిపోయాక తీర్ధంగా తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి , తెలివితేటలు పెరుగుతాయి.