Nov 12 2023నవంబరు 12 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 12 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్దశి  మ. 01గం౹౹53ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : స్వాతి తె. 03గం౹౹12ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : ఆయుష్మాన్ సా. 04గం౹౹25ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం :  శకుని మ. 02గం౹౹44ని౹౹ వరకు తదుపరి చతుష్పాద
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 03గం౹౹55ని౹౹ నుండి 04గం౹౹40ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 07గం౹౹43ని౹౹ నుండి 09గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹06ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹24ని౹౹కు

🕉️  అభ్యంగనస్నానం దీపావళి, కాత్యాయన అమావాస్య, నరకచతుర్దశి, ధనలక్ష్మీ పూజ, దీపదానం, యమతర్పణం,🕉️ 

గురుబోధ
దీపావళీ అమావాస్య నాడు ఆచరించవలసిన ముఖ్య విధివిధానాలు:
సూర్యోదయమునకు ముందే తప్పక అభ్యంగన స్నానం ఆచరించాలి. 
దీపములు వెలిగించాలి. బ్రహ్మ దేవుడు అమ్మవారిని లోకశ్రేయస్సుకోసం ప్రార్థించగా, ఏ ఇళ్ళలో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఆ ఇళ్ళు సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉంటాయని అమ్మవారు వరం ఇచ్చింది.
దీపావళి రోజు అమ్మవారిని వీలయితే తామర పువ్వులు, ఎఱ్ఱకలువ పూలతో పూజించాలి.
ఈరోజు అమ్మవారిని మనస్పూర్తిగా అష్టోత్తరంతో, సహస్రనామాలతో లేదా శ్రీసూక్తంతో కుంకుమ పూజ చేయాలి.
అమ్మవారికి పూజలో ఈ రోజు మన దగ్గర ఉన్న ఆభరణాలు సమర్పించాలి.
పులిహోర, దధ్యన్నం, పాయసాన్నం ఈ రోజు అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి. 
అమ్మవారికి ఈ రోజు నాలుగు ప్రదక్షిణలు చేయాలి.
దేవాలయంలో వీలయినన్ని ప్రదక్షిణలు చేయడం ముఖ్యంగా నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది.
సాయంత్రం వేళ గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి.
గోంగూర కాడలు నూనెలో నానబెట్టి, కాడకి వత్తి కట్టుకుని దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అని అంటూ కింద కొట్టాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు, దృష్టి దోషాలు పోతాయి
రాత్రి తిరిగి ఇంటి గుమ్మం దగ్గర హారతి వెలిగించి, కళ్ళకు అద్దుకుని గుమ్మం బయట పారవేసి, కళ్ళు, కాళ్ళు కడుక్కోవాలి.
దీపావళి నాడు స్వయంపాకం దానం చేసేవాళ్ళు పితృదేవతల యెుక్క అనుగ్రహం పొందుతారు.

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం👇


ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇


expand_less