కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: దశమి మ. 2.35 కు తదుపరి ఏకాదశి 12 మ. 12.21 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శతభిషం ఉ. 6.33 కు తదుపరి పూర్వాభాద్ర 12 తె. 5.03 కు
యోగం: వ్యాఘాత రా. 10.36 కు తదుపరి హర్షణ రా. 07.10 కు
కరణం: తైతుల ఉ. 07.57 కు తదుపరి గరజి సా. 06.46 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.23 - 01.08 కు &మ. 02.39 - 03.25 కు
వర్జ్యం: మ. 12.33 - 2.03 కు
అమృతకాలం: రా. 9.34 - 11.04 కు
సూర్యోదయం: ఉ. 6.19 కు
సూర్యాస్తమయం: సా. 5.41 కు
గురుబోధ:
పూర్వం శివుడు పార్వతితో ఒకసారి ఇలా అన్నాడు - నేను ఒకప్పుడు లోకశ్రేయస్సు కోసం వేల సంవత్సరాల తపస్సు చేసాను. లోకహితం కోసం నా మనస్సులో ఏదో ఒక ఆందోళన కలిగింది. నేనే కావాలని ఆ ఆందోళన కలిగించుకున్నాను. అప్పుడు మూసుకుని వున్న నా కళ్ళు హఠాత్తుగా తెరుచుకున్నాయి. పవిత్రమైన నా కళ్ళనుండి కొన్ని నీటి బిందువులు నేలపై పడ్డాయి. ఆ బిందువుల నుండి రుద్రాక్ష అనబడే వృక్షాలు పుట్టాయి. భక్తులను అనుగ్రహించడానికి ఆ కళ్ళనుండి నీటివిందువులు, బిందువుల నుండి వృక్షాలు, రుద్రాక్షలు నేనే సృష్టించాను. రుద్రాక్షలను భక్తులకు, బ్రహ్మవిష్ణువు మున్నగువారికి ధరించడానికి ఇచ్చాను.