కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 10 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి ఉ.9.48 కు తదుపరి షష్ఠి 11 ఉ.8.07 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పునర్వసు రా.1.17 కు తదుపరి పుష్యమి 11 రా.12.55 కు
యోగం: సాధ్య మ.12:04 కు తదుపరి శుభ 11 ఉ.8:44 కు
కరణం: గరజి మ. 12.56 కు తదుపరి వణిజ రా.12.08 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:22-1:07 కు, మ. 2:37-3:22 కు
వర్జ్యం: మ.1.51-3.22 కు
అమృతకాలం: సా.4.31-6.02 కు
సూర్యోదయం: ఉ. 6:22 కు
సూర్యాస్తమయం: సా. 5:37 కు
🕉️ 3వ కార్తికసోమవారం 🕉️
గురుబోధ:
🕉️కార్తిక మాసం లో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణకథాశ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రాలు చెపుతున్నాయి.
🕉️కార్తిక మాసం లో శ్రీమన్నారాయణుని పూజించి ధాత్రీ (ఉసిరి) వృక్షం ఉన్నచోట చూసుకుని వనభోజనం చేయాలని శాస్త్రం. వన భోజనముకు సంప్రదాయ వంటలు మాత్రమే తీసుకెళ్లాలి.