కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 10 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: నవమి సా. 4.36 కు తదుపరి దశమి 11 మ. 2.35 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ. 7.47 కు తదుపరి శతభిషం 11 ఉ. 6.33 కు
యోగం: ధ్రువ రా. 01.42 కు తదుపరి వ్యాఘాత రా. 10.36 కు
కరణం: బాలవ ఉ. 08.57 కు తదుపరి కౌలవ రా. 09.01 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.10 - 04.56 కు
వర్జ్యం: మ. 2.37-4.08 కు
అమృతకాలం: రా. 11.43 - 1.14 కు
సూర్యోదయం: ఉ. 6.19 కు
సూర్యాస్తమయం: సా. 5.41 కు
🕉️ యాజ్ఞవల్క్య మహర్షి జయంతి🕉️
గురుబోధ:
శివనామం గంగ. విభూతి యమునానది. రుద్రాక్ష సర్వపాపనాశినియైన సరస్వతి. అందుకే ఈ మూడూ ధరించి, త్రివేణీసంగమమై భక్తుడు ఇహపరాలు రెండూ సాధించగలడు. బ్రహ్మ మూడు నదుల సంగమాన్నీ, ఈ మూడు పనుల సంగమాన్నీ పోల్చి, కొలిచి రెండూ కూడా, సమాన ఫలితాలు అని తేల్చి చెప్పాడు. అందుకే త్రిమూర్తులు కూడా, శివనామ, విభూతి, రుద్రాక్ష ధారణలు తప్పక చేస్తుంటారు. శివనామం దావాగ్ని వంటిది. మహాపాపారణ్యాలను దగ్ధం చేస్తుంది. జీవులు ఈ జన్మలో దుఃఖాలు పొందడానికి గల కారణం ఇంతకు పూర్వం చేసిన పాపాలు. పాపాలు తొలగనిదే దుఃఖాలు తొలగవు. దుఃఖాలు తొలగడానికి శివనామస్మరణ సరియైన మార్గం. శివనామం నిరంతరం జపించేవాడు, పండితుడు, వైదికుడు, పుణ్యాత్ముడు, ధన్యుడు. శివనామం తొలగించగలిగేటన్ని పాపాలను భూలోకంలోని మానవులంతా కలిసినా చేయలేరు.
శ్రీ సరస్వతీమాత వైభవం - యాజ్ఞవల్క్య చరిత్ర👇
https://youtu.be/Av7R2tekPa0?si=pHrvckewX4daBc-c