"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 10 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము
తిథి : ద్వాదశి ఈ రోజు ఉ. 11గం౹౹22ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : హస్త రా. 12గం౹౹02ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం : విష్కంభ సా. 05గం౹౹06ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం : తైతుల మ. 12గం౹౹35ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మ. 12గం౹౹07ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 06గం౹౹59ని౹౹ నుండి 08గం౹౹44ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹13ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹05ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹25ని౹౹కు
🕉️ గురుద్వాదశి, ధనత్రయోదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ఈ రోజు ఉ.11 గం.ల లోపు పారణ చేయాలి.
గురుబోధ
అశ్వయుజ బహుళ ద్వాదశి రోజు దత్తాత్రేయస్వామి మొదటి అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారు కురువపురంలో, అవతార ధర్మాన్ని ముగించి అంతర్దానమైన రోజు - శ్రీ గురుదత్త జయ గురుదత్త దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా. ఈ పుణ్యతిథి రోజు దత్తపూజ, అభిషేకము, దత్తాత్రేయ స్తోత్రం, దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం లేదా శ్రవణం, గురుస్మరణం, గురుచరిత్ర పారాయణము, దత్తభజన చేయడం చాలా మంచిది. విశేషమైన గురుకటాక్షాన్ని, అనేక పరమమంగళకరమైన అద్భుతఫలితాలను ప్రసాదిస్తుంది. ధనత్రయోదశి పూజలు కూడా సాయంత్రం చేసుకొనవచ్చును.
శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం👇
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం👇
ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం👇