కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 09 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్థి ఉ.11.42 కు తదుపరి పంచమి 10 ఉ.9.48 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఆరుద్ర రా.2.23 కు తదుపరి పునర్వసు 10 రా.1.17 కు
యోగం: సిద్ధ మ.3:02 కు తదుపరి సాధ్య 10 మ.12:04 కు
కరణం: కౌలవ మ.3.05 కు తదుపరి తైతుల రా.1.55 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:07-4:52 కు
వర్జ్యం: ఉ.11.40-1.10 కు
అమృతకాలం: ఉ.10.53-12.21 కు
సూర్యోదయం: ఉ. 6:04 కు
సూర్యాస్తమయం: సా. 5:24 కు
గురుబోధ:
మతిమరుపు ఉన్న వారికి మళ్ళీ జ్ఞాపకశక్తి వచ్చి తెలివితేటలు పెరగాలి అంటే ప్రతి రోజు శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. చెంబుడు పాలతో, బిందెడు పాలతో లేక పంచపాత్రలో పోసిన పాలతో అభిషేకించి, అభిషేకించగా వచ్చిన ధారను ఒక పాత్రలో పట్టుకుని పూజ అయిపోయాక తీర్ధంగా తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి , తెలివితేటలు పెరుగుతాయి.