Nov 09 2023నవంబరు 09 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 09 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : ఏకాదశి  ఈ రోజు ఉ. 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : ఉత్తర రా. 09గం౹౹48ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : వైధృతి సా. 04గం౹౹11ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం :  బవ ఉ. 08గం౹౹23ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు & మ. 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : మ. 01గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹04ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹27ని౹౹కు

🕉️ ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ 10వ తేదీ ఉ.11 గం.ల లోపు చేయాలి.

గురుబోధ
ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
విష్ణుస్వరూపమైన పరమపవిత్ర ఏకాదశీ వ్రతమును ఎవరైతే భక్తిశ్రద్ధలతో హరినామస్మరణం, పురాణశ్రవణం, గోసేవ, యథాశక్తి దానధర్మాలు చేస్తారో, వారు సమస్తపాపక్షయమై, సర్వశుభాలను పొందుతారు.

శ్రీ వాసుదేవ శత నామాలు👇


శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం)👇


ఏకాదశి నాడు ఉపవాసం ఎలా చెయ్యాలి?👇


expand_less