కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 07 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి రా. 8.45 కు తదుపరి సప్తమి 8 రా. 7.45 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ. 9.28 కు తదుపరి ఉత్తరాషాఢ 8 ఉ. 9.18 కు
యోగం: ధృతి ఉ. 08.52 కు తదుపరి శూల 8 ఉ. 08.28 కు
కరణం: కౌలవ మ. 12.41 కు తదుపరి తైతుల రా.12.34 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.06 - 10.51 కు & మ. 02.40 - 03.25 కు
వర్జ్యం: సా. 5.24 - 7.00 కు
అమృతకాలం: తె. 4.42 - 6.12 కు & రా. 2.56 - 4.31 కు
సూర్యోదయం: ఉ. 6.17 కు
సూర్యాస్తమయం: సా. 5.42 కు
గురుబోధ:
శివపురాణంలోని ఒక శ్లోకంకాని, లేదా సగం శ్లోకంకాని, భక్తితో చదివినవాడు ఆ క్షణమే పాపవిముక్తుడౌతాడు. నిత్యం ఎంతో కొంత చొప్పున ఈ శివపురాణం వినేవాడు జీవన్ముక్తుడనబడతాడు. చదువురానివాడు ఈ గ్రంథాన్ని రోజూ భక్తితో పూజించినా చాలు, అశ్వమేథయాగఫలం పొందుతాడు. కోరిన కోరికలు తీర్చే ఉత్తమగ్రంథం ఇది. శివపురాణానికి భక్తితో నమస్కరించినవానికి సర్వదేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. శివపురాణం నిత్యం పఠించేవాడికి ఇంద్రాదులను కూడా ఆజ్ఞాపించే దివ్యశక్తి లభిస్తుంది. శివపురాణం నిత్యం పఠించేవాడు చేసే ప్రతిపుణ్యం కోటిరెట్లు ఫలితం ఇస్తుంది. శివపురాణంలోని రుద్రసంహిత, శ్రద్ధగా చదివితే బ్రహ్మహత్యాపాపం కూడా నశిస్తుంది.