Nov 07 2022నవంబర్ 07 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 07 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం శుక్లపక్షము 

తిథి : చతుర్దశి మధ్యాహ్నం 03గం౹౹47ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ 
వారం : ఇందువారం  (సోమవారం)
నక్షత్రం : అశ్విని రాత్రి 12గం౹౹48ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం :   సిద్ధి  ఈ రోజు రాత్రి 10గం౹౹37ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  వణిజ  ఈ రోజు సాయంత్రం 04గం౹౹15ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు మరియు  మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹11ని౹౹ వరకు 
 వర్జ్యం : రాత్రి 08గం౹౹46ని౹౹ నుండి 10గం౹౹22ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 05గం౹౹33ని౹౹ నుండి 07గం౹౹09ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹28ని౹౹

జ్వాలాతోరణం, కార్తికసోమవారం

గురుబోధ
         యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. 
        ఈ శిక్షను తప్పించుకోవాలంటే కార్తికపూర్ణిమ రోజున ఎవరైతే జ్వాలాతోరణం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు.      జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే-   ‘‘ శివా! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’
       అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి - ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనోపెడతారు  అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.

 
expand_less