Nov 06 2025నవంబరు 06 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 06 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: కార్తిక బహుళ పాడ్యమి రా.6.40 కు తదుపరి విదియ 7 సా.4.17 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: భరణి ఉ.8.35 కు తదుపరి కృత్తిక 7 ఉ.6.58 కు
యోగం: వ్యతీపాత ఉ.7:04 కు తదుపరి పరిఘ 7 రా.10:27 కు
కరణం: కౌలవ మ.2.55 కు తదుపరి తైతుల తె.3.40 కు
రాహుకాలం: మ. 1.30-3.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:06-10:51 కు, మ. 2:38-3:23 కు
వర్జ్యం: రా.7.49-9.19 కు
అమృతకాలం: రా.01:22-02:46 కు
సూర్యోదయం: ఉ.6:04 కు
సూర్యాస్తమయం: సా.5.26 కు

గురుబోధ:
ధర్మం అభివృద్ధి చెందడానికి భక్తితో మంత్రపూర్వకంగా రుద్రాక్షలను ధరించాలి. భస్మమును ధరించినవాడు, రుద్రాక్షను ధరించినవాడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రులు. ఈ రెండింటిని ధరించినవారికి భక్తి, ముక్తి తప్పక లభిస్తాయి. ఈ రెంటినీ ధరించి పంచాక్షరీ జపం చేసేవాడు పరిపూర్ణ శివభక్తుడు.

expand_less