"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబరు 06 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము తిథి : నవమి తె. 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి దశమి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం : ఆశ్లేష మ. 02గం౹౹12ని౹౹ వరకు తదుపరి మఘ యోగం : శుక్ల సా౹౹ 04గం౹౹03ని౹౹వరకు తదుపరి బ్రహ్మ కరణం : తైతుల సా. 04గం౹౹33ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹55ని౹౹ వరకు & మ. 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు వర్జ్యం : తె. 03గం౹౹29ని౹౹ నుండి 05గం౹౹25ని౹౹ వరకు అమృతకాలం : మ. 12గం౹౹26ని౹౹ నుండి 02గం౹౹11ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹04ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹28ని౹౹కు గురుబోధ: పండుగలు ఇంటిలో జరపకపోవడం వల్ల దేవతల అనుగ్రహం పొందలేము. పండుగలు, పర్వదినములు వచ్చినప్పుడు తప్పక ఇంటిలో యథాశక్తి పూజ చేయాలి. ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి. పండుగ వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి చెప్పాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ రోజు చేసే పూజ, జప, తప లేదా ఇతర పుణ్యకార్యముల వలన వేలరెట్ల ఫలితం వస్తుంది. ఉదా౹౹ దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం, అర్చించడం వంటివి చేయడం వల్ల అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుంది.