" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 06 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి : త్రయోదశీ సాయంత్రం 04గం౹౹25ని౹౹ వరకు తదుపరి చతుర్దశీ వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : రేవతి రాత్రి 12గం౹౹38ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : వజ్ర ఈ రోజు రాత్రి 11గం౹౹50ని౹౹ వరకు తదుపరి సిద్ధి కరణం : తైతుల ఈ రోజు సాయంత్రం 04గం౹౹28ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹58ని౹౹ నుండి 04గం౹౹43ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹45ని౹౹ నుండి 02గం౹౹20ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 10గం౹౹15ని౹౹ నుండి 11గం౹౹50ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹28ని౹౹ గురుబోధ కార్తిక మాసం 13వ రోజు గోవును పూజించటం మహాపుణ్యం. ఈరోజు భక్తిశ్రద్ధలతో గోసమితి దగ్గరికి కానీ, ఇంట్లో ఉన్న గోవు దగ్గరకు కానీ వెళ్ళండి. ఆ ఆవు కాలి గిట్టలకు పసుపు, కుంకుమ బొట్టు పెట్టండి, చుట్టూ ప్రదక్షిణ చేయండి. అది కూడా దూడతో కలిపిన ఆవులను పూజించండి. త్రయోదశి నాడు ఆవును పూజిస్తే అటువంటి వ్యక్తులు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన మహా ఫలితం పొందుతారు.