కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 05 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి రా. 9.21 కు తదుపరి పంచమి 6 రా. 9.18 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ. 8.21 కు తదుపరి మూల 6 ఉ. 9.09 కు
యోగం: అతిగండ ఉ. 11.28 కు తదుపరి సుకర్మ 6 ఉ. 10.51 కు
కరణం: వణిజ ఉ. 11.54 కు తదుపరి విష్టి రా. 12.16 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.34 - 09.19 కు & రా. 10.44 - 11.35 కు
వర్జ్యం: సా. 4.37 - 6.16 కు
అమృతకాలం: రా. 2.32 - 4.11 కు
సూర్యోదయం: ఉ. 6.16 కు
సూర్యాస్తమయం: సా. 5.43 కు
🕉️ కార్తిక శుద్ధ చతుర్థి - నాగ చతుర్థి, నాగులచవితి🕉️
https://youtu.be/bB-00LLmyRQ
https://youtu.be/wnzGUxiww-k
గురుబోధ:
సర్పదోషాలతో ఇబ్బంది పడేవారు, సంతాన సమస్యలతో బాధపడేవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రోజు నాగచతుర్థిని భక్తిశ్రద్ధలతో ఆచరించి నాగ అష్టోత్తర శతనామావళితో పూజ చేసి, నాగ ప్రతిమలను అభిషేకం చేస్తే సర్పబాధలు వాళ్ళకి ఉండవు. సుబ్రహ్మణ్య ఆరాధన లేదా మానసాదేవి ఆరాధన వలన కూడా సర్ప దోషాలు, రాహు, కేతు గ్రహదోషాలు తొలగుతాయి. సుబ్రహ్మణ్య అష్టకం లేదా మానసాదేవి దివ్యచరిత్ర, స్తోత్రం, పూజ, జపం కూడా విశేష ఫలితం ఇస్తుంది. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోవాలంటే నాగదోష పరిహార స్తోత్రం పఠించాలి లేదా శ్రవణం చేయాలి.
నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహమూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసిన తర్వాత, తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి.