"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 05 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము
తిథి : అష్టమి 6వ తేదీ తె. 03గం౹౹10ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : పుష్యమి ఉ. 11గం౹౹48ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : శుభ మ. 01గం౹౹37ని౹౹వరకు తదుపరి శుక్ల
కరణం : బాలవ మ. 02గం౹౹06ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 03గం౹౹57ని౹౹ నుండి 04గం౹౹43ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹52ని౹౹ నుండి 03గం౹౹37ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹04ని౹౹ నుండి 06గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹04ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹29ని౹౹కు
🕉️ రవి పుష్య యోగం🕉️
గురుబోధ: ఆదివారం అష్టమీ తిథి, పుష్యమీ నక్షత్రంతో కూడిన రవిపుష్యయోగం అత్యంత శుభయోగ కాలం, పర్వదినం. ఉదయం 06:36 నుండి ఉదయం.10:29 వరకు అష్టమితో కూడిన రవిపుష్య యోగం అదృష్ట పుణ్య కాలం. ఆ కాలంలో గృహంలో నారికేళ దీపం వెలిగించి కాలభైరవ మంత్ర జపం చేస్తే గృహంలో గొడవలు, పోరు, మనస్పర్థలు నశిస్తాయి. ఊహించని రీతిలో ప్రశాంతత లభిస్తుంది.
ఈ రోజున రుద్రుని, కాలభైరవస్వామిని ప్రత్యేకంగా పూజించడం వల్ల మీ బలం, శక్తి, సామర్ధ్యం, సంపద పెరుగుతాయి. ఈ సమయంలో చేసే జపం,హోమం, అభిషేకం విశేష ఫలితం ఇస్తుంది. ఈ సమయంలో రుద్రుని, కాలభైరవుని దర్శనం, హోమం, జపం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. పూర్వ జన్మ కర్మలను సులభంగా పొగట్టుకోవచ్చు. శత్రు, గ్రహ, రోగ, సర్పదోషాలు ఈ రోజు చేసే శివారాధన వలన తొలగించుకోవచ్చు. ఈ పవిత్రమైన రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో సూర్య సంబంధిత దుష్ప్రభావాలు తొలగిపోతాయి. మఱియు గ్రహ దోషాలు నశిస్తాయి.
కాలభైరవాష్టకం👇
శివ కవచం👇