Nov 04 2023నవంబరు 04 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 04 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : సప్తమి రా. 01గం౹౹22ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : పునర్వసు ఉ. 09గం౹౹43ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : సాధ్య మ. 01గం౹౹03ని౹౹వరకు తదుపరి శుభ
కరణం :  విష్టి మ. 11గం౹౹59ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹04ని౹౹ నుండి 07గం౹౹33ని౹౹ వరకు
వర్జ్యం : రా. 06గం౹౹28ని౹౹ నుండి 08గం౹౹12ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹50ని౹౹ నుండి 06గం౹౹04ని౹౹ వరకు & ఉ. 07గం౹౹06ని౹౹ నుండి 08గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹04ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹29ని౹౹కు

గురుబోధ: •	సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఎన్ని పనులు ఉన్నా ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడ్ని దర్శించి నమస్కరించాలి.  అర్ఘ్యం ఇవ్వాలి. ఉపనయనం అయిన వారు సంధ్యావందనం చేయాలి. ఉపనయనం కాని వారు లేదా స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ శ్రీ దేవీభాగవతములోని ఈ క్రింది శ్లోకముతో అర్ఘ్యం ఇవ్వవచ్చని శాస్త్రం. 
యో దేవః సవితాఽస్మాకం ధియో ధర్మాది గోచరాః | ప్రేరయేత్ తస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే ||


expand_less