" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 04 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి : ఏకాదశి రాత్రి 06గం౹౹54ని౹౹ వరకు తదుపరి ద్వాదశీ (05) సాయంత్రం 05గం౹౹28ని౹౹ వరకు వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 01గం౹౹38ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం : వ్యాఘాత ఈ రోజు రాత్రి 03గం౹౹15ని౹౹ వరకు తదుపరి హర్షణ కరణం : వణిజ ఈ రోజు ఉదయం 06గం౹౹51ని౹౹ వరకు తదుపరి భద్ర రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 10గం౹౹18ని౹౹ వరకు అమృతకాలం : సాయంత్రం 05గం౹౹58ని౹౹ నుండి 07గం౹౹30ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹29ని౹౹ 👉🏻🕉️ఏకాదశీ🕉️ ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము (భోజనం) రేపు(శనివారం) ఉదయం చేయవచ్చును. గురుబోధ ఏకాదశీ నాడు శంఖంతో అభిషేకించినా లేక శంఖంతో తీర్థం తీసుకున్నా వాళ్ళు పొందే శుభములను ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. డబ్బుతో పాటు శాంతి, సౌఖ్యం, కుటుంబవృద్ధి లభిస్తాయి. ఈ రోజున లక్ష్మీ నారాయణుల ప్రతిమలు కానీ పటాలు కానీ పెట్టుకుని తులసీదళాలతో పూజిస్తూ వ్యూహ లక్ష్మీ మహా మంత్రం చేసుకోవడం సర్వశుభప్రదం.