"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 03 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము
తిథి : షష్ఠి రా. 11గం౹౹32ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : ఆర్ద్ర ఉ. 07గం౹౹39ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : సిద్ధ మ. 12గం౹౹53ని౹౹వరకు తదుపరి సాధ్య
కరణం : గరజి ఉ. 10గం౹౹24ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మ.12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹41ని౹౹ నుండి 10గం౹౹25ని౹౹ వరకు
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉ. 06గం౹౹03ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹30ని౹౹కు
గురుబోధ: నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహ మూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసిన తర్వాత తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి. శ్రీ మద్ధేవీ భాగవతము నవమ స్కంధం లో ఉన్న ఈ ద్వాదశ నామమంత్రములను నిత్యం లేదా పర్వదినములలో పఠిస్తే నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయని ఫలశ్రుతి. నాగదేవతా నామములు: 1. ఓం జరత్కారు ప్రియాయై నమః , 2. ఓం జగత్గౌర్యై నమః, 3. ఓం సిద్ధయోగిన్యై నమః, 4. ఓం నాగభగిన్యై నమః, 5. ఓం నాగేశ్వర్యై నమః, 6. ఓం విషహరాయై నమః, 7. ఓం జగత్కారవే నమః, 8. ఓం మనసాయై నమః, 9. ఓం వైష్ణవ్యై నమః, 10. ఓం శైవ్యై నమః, 11. ఓం ఆస్తీకమాత్రే నమః, 12. ఓం మహాజ్ఞానయుతాయై నమః
నాగదోష పరిహార స్తోత్రమ్👇
మంగళ షష్ఠీ లేదా దేవసేనా స్తోత్రం👇