Nov 02 2025నవంబరు 02 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 02 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
qqదక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం

తిథి: ద్వాదశి రా.1.15 కు తదుపరి త్రయోదశి 3 రా.11.39 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాభాద్ర మ.1.54 కు తదుపరి ఉత్తరాభాద్ర 3 మ.12.59 కు
యోగం: వ్యాఘాత రా.9:18 కు తదుపరి హర్షణ 3 సా.6:49 కు
కరణం: బవ మ.1.58 కు తదుపరి బాలవ రా.1.15 కు
రాహుకాలం: సా. 04.30-06.00 కు
దుర్ముహూర్తం: సా.4:09-4:55 కు
వర్జ్యం: రా.11.22-12.52 కు
అమృతకాలం: ఉ.6:05-7.38 కు
సూర్యోదయం: ఉ.6:02 కు
సూర్యాస్తమయం: సా.5.26 కు

🕉️ క్షీరాబ్ది ద్వాదశి, స్వాయంభువ మన్వాది 🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు చేయాలి.

గురుబోధ:
_కార్తికమాసంలో ఈ ఉత్థానద్వాదశి రోజున శ్రీహరి నిద్ర లేస్తాడు. ఈరోజు ఉదయం 4 గంటలకు లేదా ముందే లేచి కార్తిక స్నానం చేయడం మంచిది. ఇంట్లోనే స్నానం చేసే వారు ఆవుపాలు కొంచెం వేసి గంగాజలంతో స్నానం చేస్తున్న సంకల్పం చెప్పుకోవాలి._
_ఈ రోజు చేసే గోదానం మరింత మంచిది. స్వయంపాకం ఒక్కరు లేదా ముగ్గురు లేదా ఐదుగురికి ఇవ్వడం మంచిది. గురువులకు పాదసేవ చేసుకుంటే, గురువు పాదాలు కడిగిన నీటిని నెత్తిన చల్లుకుంటే అది విష్ణుపాదోదకముతో సమానం._

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less