కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 02 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: పాడ్యమి సా. 6.31 కు తదుపరి విదియ 3 రా. 7.57 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: విశాఖ 3 తె. 5.12 కు తదుపరి అనూరాధ
యోగం: ఆయుష్మాన్ ఉ. 11.19 కు తదుపరి సౌభాగ్య 3 ఉ. 11.40 కు
కరణం: కింస్తుఘ్న ఉ. 07.21 కు తదుపరి బవ రా. 08.21 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 06.15 - 07.47 కు
వర్జ్యం: ఉ. 9.09 - 10.54 కు
అమృతకాలం: రా. 7.40 - 9.24 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5.44 కు
🕉️ శివకేశవ ప్రీతికరమైన పరమపవిత్ర కార్తిక మాసము ప్రారంభం 1వ రోజు - బలి పాడ్యమి 🕉️
గురుబోధ:
కార్తికమాసం పరమపవిత్రమైనది. “న కార్తిక సమో మాసః” అని వ్యాసుని వాక్కు. కార్తిక మాసానికి సాటివచ్చే మాసం లేదని దీనికి అర్థం. ఇంత గొప్ప మాసంలో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణకథాశ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రాలు చెపుతున్నాయి.
ఈ మాసములో నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండడం చాలా మంచిది. రాత్రి నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేస్తే నక్త వ్రతం అంటారు. నెల నాళ్ళు నక్తవ్రత ఆచరణ చేయలేని వారు కనీసం సోమవారం అయినా సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఆలయం దర్శించుకోవాలి. కార్తికమాసంలో చేసే ఆలయ ప్రదక్షిణ చాలా గొప్ప పుణ్యం ఇస్తుంది.
కార్తికమాసంలో ఒక్కరోజైనా దీపం వెలిగించి దీపదానం చేసేవారు స్వర్గానికి వెడతారు. దీపదానానికి మించిన దానం, వ్రతం, దాని వల్ల వచ్చే ఫలం ఇంతకు పూర్వం లేదు, ఉండబోదు.
కార్తికమాసం మెుత్తం దీపములు వెలిగించినా , లేక దానాలు చేసినా, ఆయువు పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ధనం, ధాన్యం, పుత్రసంతానం కలుగుతాయి.
కార్తికమాసంలో దీపాన్ని వెలిగించడమే దీపదానం క్రింద లెక్కకు వస్తుంది. ఇక వెలుగుతున్న దీపాన్ని దక్షిణతో పాటుగా విప్రునికి దానంచేస్తే వచ్చే ఫలితం వర్ణించడానికి వీలు కానిదని నారదపురాణం చెపుతున్నది.