Nov 02 2023నవంబరు 02 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 02 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : పంచమి రా. 11గం౹౹06ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : మృగశిర ఉ. 06గం౹౹52ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : శివ మ. 01గం౹౹14ని౹౹వరకు తదుపరి సిద్ధ
కరణం :  కౌలవ ఉ. 09గం౹౹30ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు & మ. 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం : మ. 03గం౹౹52ని౹౹ నుండి 05గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹19ని౹౹ నుండి 10గం౹౹58ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹02ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹30ని౹౹కు

గురుబోధ తప్పక చేయవలసిన 4 పనులు: లేవగానే బ్రతికిఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకు నమస్కారము చేయండి. మగవాళ్లు పిల్లనిచ్చిన అత్తమామలకు, ఆడవాళ్లు అత్తమామలకు నమస్కారం చేయండి. వేళ తప్పకుండా సంధ్యావందనం చేయండి. మంత్రం లేకపోయినా కనీసం సూర్యుణ్ణి తలచుకొని ఆడ, మగ అందరూ ఆర్ఘ్యం విడిచిపెట్టండి. ఉపనయనం అయినవారు తప్పక గాయత్రీ మంత్రపూర్వకంగా సంధ్యావందనం చేయండి. పితృతర్పణాలు ఇవ్వండి. మహాలయపక్షాలు వచ్చినప్పుడు, అమావాస్యలు వచ్చినప్పుడు, సంవత్సరానికి ఒకసారి వచ్చే తద్దినం నాడు యథావిధిగా తోచిన రీతిలో పిండప్రదానం చేయండి. ఈ నాలుగూ చేసిన వారు తప్పక ధర్మార్థకామమోక్షములను పొంది నరకం పొందరని శాస్త్రవాక్యం.

expand_less