" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 02 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి : నవమి రాత్రి 10గం౹౹47ని౹౹ వరకు తదుపరి దశమి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : ధనిష్ఠ తెల్లవారి 04గం౹౹00ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం : గండ ఈ రోజు ఉదయం 10గం౹౹27ని౹౹ వరకు తదుపరి వృద్ధి కరణం : బాలవ ఈ రోజు ఉదయం 10గం౹౹05ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹22ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 09గం౹౹13ని౹౹ నుండి 10గం౹౹43ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 06గం౹౹14ని౹౹ నుండి 07గం౹౹44ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹02ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹30ని౹౹ గురుబోధ కార్తికమాసం పరమపవిత్రమైనది. “న కార్తిక సమో మాసః” అని వ్యాసుని వాక్కు. కార్తిక మాసానికి సాటివచ్చే మాసం లేదని దీనికి అర్థం. ఇంత గొప్ప మాసంలో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణకథాశ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రాలు చెపుతున్నాయి.