Nov 01 2025నవంబరు 01 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 01 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం

తిథి: కార్తిక శుద్ధ ఏకాదశి రా.2.41 కు తదుపరి ద్వాదశి 2 రా.1.15 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: శతభిషం మ.2.26 కు తదుపరి పూర్వాభాద్ర 2 మ.1.54 కు
యోగం: ధ్రువ రా.11:35 కు తదుపరి వ్యాఘాత 2 రా.9.18 కు
కరణం: వణిజ మ.3.12 కు తదుపరి భద్ర రా.2.41 కు
రాహుకాలం: ఉ. 09.00-10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:49-8:34 కు
వర్జ్యం: రా.8.50-10.24 కు
అమృతకాలం: ఉ.7:18-8:53 కు
సూర్యోదయం: ఉ.06:02 కు
సూర్యాస్తమయం: సా.5.27 కు

🕉️ కార్తిక శుద్ధ ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి, ద్వాదశీపారణ రేపు చేయాలి.

గురుబోధ:
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. అదికూడా కార్తిక మాసం లో వచ్చే రెండు ఏకాదశుల్లో తెల్లవారు ఝామున లేచి నదుల్లో కానీ, కాలువల్లో కానీ ఎక్కడైనా స్నానం చేసి విఘ్ణ ఆలయం లేదా శివాలయానికి వెళ్లి యథాశక్తి అర్చన చెయ్యాలి. తులసీదళాలతో హరిని, బిల్వదళాలతో హరుడిని అర్చన చేసి, ఉపవాసం ఉండి రాత్రికి నక్త భోజనం కానీ లేదా సంపూర్ణ ఉపవాసం కానీ ఉండి భగవంతుని కథలు వింటూ భగవత్ ధ్యానం చేసినవాడు జీవితంలో యమకింకరుల దర్శనము చేయడు. నరకానికి వెళ్ళడు. సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలు, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించిన వాడు ఐశ్వర్యము పొందుతాడు. చామంతి పువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవిని పొందుతాడు. ఏకాదశి రోజు జాగరణ చేసి మరుసటి రోజు హరి దర్శనము చేసుకున్నవాడు జీవితంలో సుఖం, శాంతి, ఆనందం తప్ప మాట వరుసకి కూడా దౌర్భాగ్యం పొందడు.
ఏకాదశీ ఉపవాసము, నక్తము ఒకే రోజు ఉంటే అందులో ఏదైనా ఒక వ్రతం ఆచరిస్తే సరిపోతుంది.
ఉదా 1: నెల రోజులు లేదా కొన్ని పర్వ దినములు నక్త వ్రతం చేయాలి అని అనుకుంటే ఒకవేళ ఏకాదశి వచ్చినా నక్షత్ర దర్శనం అయ్యాక పారణ (ప్రసాదం) స్వీకరించవచ్చు.
ఉదా 2: ఒకేరోజు ఏకాదశి మరియు శ్రాద్ధమును ఆచరించవలసి వస్తే శ్రాద్ధమునకు ప్రాధాన్యం ఇచ్చి భోజనం స్వీకరించాలని శాస్త్రం.
ఉదా 3: ఏకాదశీ వ్రతం చేసిన వారు నక్తము చేయవలసి వస్తే ద్వాదశి ఉదయం భోజనం (ఒకపూట పగలు భుజించి మరుసటి రోజు వరకు ఉపవాసం ఉంటే ఛాయానక్తము అంటారు ) చేసి ఆ రోజు ఏమీ తినకుండా ఉండవచ్చు.
పైవన్నీ ఆరోగ్యం సహకరించిన వారికి మాత్రమే!

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=HVznXhr9Kz3xvT1Q

expand_less