Nov 01 2023నవంబరు 01 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 01 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్థి రా. 10గం౹౹38ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : రోహిణి ఉ. 06గం౹౹12ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : పరిఘ మ. 02గం౹౹07ని౹౹వరకు తదుపరి శివ
కరణం :  బవ ఉ. 09గం౹౹19ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹22ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹57ని౹౹ నుండి 01గం౹౹35ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹01ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹30ని౹౹కు

🕉️ సంకటహరచతుర్థి 🕉️ 

గురుబోధ 
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిన సంకటహరచతుర్థీవ్రతం ఆచరిస్తారు. వినాయకుడు శీఘ్రంగా, తక్షణం కోరికలు తీరుస్తాడు. విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఉపాసించినా, పూజించినా ఆయన నామాలను తలచుకున్నా అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. విఘ్నాలు తొలగిపోతాయి. మానవులు ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావడం సహజమే! మంచి పనులకి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. చెడ్డపని చేసేవాడికన్నా మంచిపని చేసేవాడిని భగవంతుడు ఎక్కువగా పరీక్షిస్తాడు. మంచిపని చేసేవాడికి అడుగడుక్కీ విఘ్నాలు, కష్టాలు వస్తాయి. విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడిని భక్తితో నిత్యం పూజించండి. పూజ చేయలేకపోతే కనీసం ఆయన నామాలనైనా జపించండి, తలచుకోండి. చతుర్థీ తిథుల్లో వినాయకుణ్ణి భక్తితో పూజిస్తే వారికి ఎటువంటి విఘ్నాలు ఉండవు. అనుకున్న కోరికలు తీరుతాయి అని పార్వతీదేవి శివపురాణం గణేశఖండంలో ప్రజలకు ఉపదేశించింది. అందువల్ల కలియుగంలో ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి.

సంకటనాశనగణేశ స్తోత్రం👇


శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇


expand_less