" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 01 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి : అష్టమి రాత్రి 01గం౹౹02ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 07గం౹౹15ని౹౹ వరకు తదుపరి శ్రవణ యోగం : శూల ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹15ని౹౹ వరకు తదుపరి గండ కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 10గం౹౹51ని౹౹ నుండి 12గం౹౹26ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 07గం౹౹50ని౹౹ నుండి 09గం౹౹19ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹02ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹30ని౹౹ 👉🕉️కార్తవీర్య జయంతి, గోపాష్టమి🕉️👈 గురుబోధ దీపము వెలిగించడము అత్యంత పుణ్యప్రదం. కానీ దీపముల పేరు తో ఆలయంలో ఉన్న విగ్రహాలకు, నందికి, చెట్లకు ఆనుకుని పెట్టడం వంటివి చేయరాదు. ఆలయధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం మంచిదని శాస్త్రం. అభిషేకం, దీపం వెలిగించడం కంటే ఆలయం శుభ్రంగా ఉంచడము వల్ల వచ్చే పుణ్యం మరింత గొప్పది.