May 31 2023మే 31 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 31 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి ఉ. 10గం౹౹52ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : చిత్త 31 వ తేదీ తె. 04గం౹౹50ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : వ్యతీపాత రా. 08గం౹౹15ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం :  విష్టి మ. 01గం౹౹45ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹32ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹ వరకు   
వర్జ్యం : మ. 12గం౹౹05ని౹౹ నుండి 01గం౹౹40ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹26ని౹౹ నుండి 10గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹27ని౹౹కు

🕉️నిర్జల ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణము గురువారం ఉదయం 11 గం.ల లోపు చెయ్యాలి.

గురుబోధ
ఏకాదశికి హరివాసరమని పేరు, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి. జ్యేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు, యథాశక్తి దానాలు చేసుకున్నవారు నారాయణుని అర్చన చేసినవారు తిరుగులేని శుభఫలితాలు పొందుతారు. లక్ష్మీనారాయణులను అష్టోత్తరశతనామాలతో పూజించాలి. తులసీదళములతో పూజిస్తే ఆరోగ్యము, బిల్వపత్రాలతో పూజిస్తే సంపదలు లభిస్తాయి. ఈ రోజు శివలింగానికి పంచామృతాలతో, శంఖజలంతో అభిషేకించి, బిల్వపత్రాలు, తులసీదళాలతో పూజించాలి. ఏకాదశినాడు గురువులకు ప్రదక్షిణ చేసినవారు సాక్షాత్ వైకుంఠంలో నారాయణునికి ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారని పద్మపురాణం చెపుతోంది. ఒంట్లో ఓపికనుబట్టి ఫలహారం లఘువుగా స్వీకరించి, ఉపవసించి ఏకాదశీవ్రతమును ఆచరించి యథాశక్తి దానధర్మాలు చేసుకున్నవారు గురుకటాక్షం, హరికటాక్షం అక్షయంగా పొందుతారు.

expand_less