May 30 2023మే 30 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : దశమి ఉ. 10గం౹౹03ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : హస్త తె. 03గం౹౹43ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం : సిద్ధి రా. 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  గరజి మ. 01గం౹౹07ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & రా. 10గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹33ని౹౹ వరకు   
వర్జ్యం : ఉ. 11గం౹౹01ని౹౹ నుండి 12గం౹౹44ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹17ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹26ని౹౹కు

🕉️దశపాపహర దశమి🕉️

గురుబోధ
ఈ రోజు చేయవలసిన విధి విధానాలు :
గంగా స్నానం, ఆపకుండా గోవింద నామస్మరణం. స్నానం ఆచరించినప్పుడు నీళ్ళలో చేతిని త్రిప్పుతూ “గంగ, గంగ, గంగ” అని మూడుసార్లు భక్తితో సంకల్పం చేసుకొని స్నానం ఆచరించడం. శ్రీమన్నారాయణుడిని అష్టోత్తరశతనామావాళితో కాని, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదువుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం, యథాశక్తి దానధర్మాలు చేయడం సకల పాపహరణం. అవకాశం ఉన్నవాళ్లు పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం నక్షత్రదర్శనం చేసుకొని భోజనం చేస్తే చాలా మంచిది.

expand_less