May 29 2023మే 29 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 29 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : నవమి ఉ. 08గం౹౹45ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : ఉత్తర రా. 02గం౹౹02ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : వజ్ర రా. 09గం౹౹01ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  కౌలవ ఉ. 11గం౹౹49ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹15ని౹౹ వరకు & మ. 02గం౹౹59ని౹౹ నుండి 03గం౹౹51ని౹౹ వరకు   
వర్జ్యం : ఉ. 07గం౹౹47ని౹౹ నుండి 09గం౹౹31ని౹౹ వరకు
అమృతకాలం : సా. 06గం౹౹12ని౹౹ నుండి 07గం౹౹56ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹26ని౹౹కు

గురుబోధ
పార్థివలింగ (ఇసుక లేదా మట్టితో చేసిన) అర్చన అత్యంత శ్రేష్ఠమైనది. పార్థివలింగార్చన వల్ల తీరని కోరికలు ఉండవు. నిత్యం పార్థివలింగాన్ని తయారు చేసి పూజించడం కుదరకపోతే, మన ఇంటిలో ఉన్న ఏ లింగానికైనా మట్టి పూసి పూజ లేదా అభిషేకం చేసినా అది పార్థివలింగమునకు పూజ చేసిన ఫలితం కలుగజేస్తుందని శాస్త్రం. శ్రీ శివమహాపురాణం ప్రకారం ఎట్టి పరిస్థితిలోనైనా “గురుకటాక్షం" ఉంటేనే వాడు శివలింగాన్ని అర్చన చేయగలుగుతాడు, శివ కథలను వినగలడు, ఈ జన్మలోనే ముక్తిని పొందగలడు. శివలింగార్చన, అభిషేకం ఆడవారు కూడా చేయవచ్చు.

expand_less