కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 28 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి ఉ.8.28 కు తదుపరి త్రయోదశి 29 ఉ.9.34 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: చిత్ర ఉ.9.00 కు తదుపరి స్వాతి 29 ఉ.10.46 కు
యోగం: వరీయాన్ 29 తె.3:54 కు తదుపరి పరిఘ 30 తె.4:35 కు
కరణం: కౌలవ రా.8:52 కు తదుపరి గరజి 29 రా.10:53 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.04 - 10.55 కు, మ. 3.14 - 4.06 కు
వర్జ్యం: మ.3.00 - 4.43 కు
అమృతకాలం: రా. 12.54 - 02.40 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.41 కు
🕉️ ప్రదోషం 🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం 8 గం.ల లోపు చేసెయ్యాలి.
గురుబోధ:
🕉️ప్రదోషసమయం (సాయం సంధ్య) లో శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది.
🕉️ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial