May 28 2023మే 28 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 28 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : అష్టమి ఉ. 07గం౹౹05ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : పుబ్బ రా. 11గం౹౹58ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : హర్షణ రా. 08గం౹౹40ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం :  బవ ఉ. 09గం౹౹56ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹42ని౹౹ నుండి 05గం౹౹34ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 06గం౹౹20ని౹౹ నుండి 08గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : సా. 04గం౹౹55ని౹౹ నుండి 06గం౹౹40ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹25ని౹౹కు

గురుబోధ
ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడిని ఉదయం తప్పక దర్శించి నమస్కరించడం అర్ఘ్యం ఇవ్వడం సర్వశుభఫలితాలను ప్రసాదిస్తుంది. అందుకే పూర్వం సదాచారాలు పాటించే మన పెద్దలు సూర్యుని దర్శనం కాకుండా మంచినీళ్లు కూడా త్రాగేవారు కాదు. శివకేశవుల మధ్య భేదం చూపరాదు. ఒకరిని ఎక్కువ చేయడం, మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని పురాణములు చెబుతున్నాయి. నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన భూమండలమునకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. - శ్రీ నారదపురాణము

expand_less