" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 27 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము తిథి : అష్టమి పూర్తిగా ఉంది తదుపరి నవమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : మఖ రా. 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం : వ్యాఘాత రా. 07గం౹౹58ని౹౹ వరకు తదుపరి హర్షణ కరణం : వణిజ ఉ. 07గం౹౹42ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹29ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹52ని౹౹ వరకు అమృతకాలం : రా. 06గం౹౹52ని౹౹ నుండి 08గం౹౹38ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹25ని౹౹కు గురుబోధ జ్యేష్ఠమాసంలో శుక్ల పక్షం లో వచ్చే అష్టమి శనిదేవుడికి, కాలభైరవునికి ప్రీతిపాత్రమైనది. ఈ రోజు చేయవలసిన విధి విధానాలు: 1) శివ పంచాక్షరి కానీ శనీశ్వర స్త్రోత్రం గాని చదువుకోవాలి. 2) శివాలయంలో గాని, నవగ్రహ ఆలయంలో గాని నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం). ఈ సంవత్సరం శనివారం రావడం మరింత శ్రేష్ఠం, అనంతఫలదాయకం. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - https://youtu.be/41P8HbBhQAs పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం - https://youtu.be/97Q4_4k_hH4 శ్రీ కాలభైరవాష్టకం - https://youtu.be/-9bEjdGS0MA శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్ - https://youtu.be/BVixGi7_Unw