May 25 2024మే 25 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 25 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ సా. 6.37 కు తదుపరి తదియ
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ. 10.35 కు తదుపరి మూల
యోగం: సిద్ధ ఉ. 10.07 కు తదుపరి సాధ్య
కరణం: తైతుల ఉ. 07.14 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 05.42 - 07.26 కు
వర్జ్యం: సా. 6.38 - 8.14 కు
అమృతకాలం: తె. 4.17 - 5.47 కు
సూర్యోదయం: ఉ. 5.42 కు
సూర్యాస్తమయం: సా. 6.45 కు

గురుబోధ:
యోగీశ్వరుడయిన శ్రీకృష్ణుడే "శ్రీమద్భాగవతం". భాగవత మహిమలేని పురాణం లేదు.
మానవునిలో సమస్తపాపాలను పటాపంచలు చేసి భగవత్ భక్తిని ప్రకాశింపజేసే "సుదర్శనం" శ్రీమద్భాగవతం
మానవ జీవితంలోని భయంకర దారిద్ర్య దుఃఖాలను పారద్రోలే "రుక్మిణీకృష్ణస్వరూపం" శ్రీమద్భాగవతం
ఒక్క భాగవతాన్ని శ్రద్ధగా విన్నవాడి వంశంలో 21 తరాలు పూర్వం, మరియు రాబోయే 21 తరాలు అంతా వైకుంఠానికి వెళ్తారు.

expand_less