May 25 2023మే 25 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 25 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : షష్ఠి రా. 03గం౹౹06ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : పుష్యమి సా. 04గం౹౹24ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : వృద్ధి సా. 06గం౹౹08ని౹౹ వరకు తదుపరి ధృవ
కరణం :  కౌలవ సా. 04గం౹౹08ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹48ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మ. 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹50ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : ఉ. 09గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹24ని౹౹కు

గురుబోధ
ప్రతిమాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠీ తిథినాడు షష్ఠీదేవిని పూజించడం వలన పిల్లల ఆయువు పెరుగుతుంది. పిల్లలు లేనివారికి పిల్లలు పుట్టి తీరుతారు. అసలు గర్భమే రానివారు గర్భం ధరిస్తారు. గర్భం వచ్చి గర్భస్రావం అయ్యేవారికి గర్భం నిలబడుతుంది. పిల్లలు పుట్టి చనిపోవడం, రోగాలతో కదల్లేని స్థితిలో ఉన్న పిల్లలు ఉన్నవారు ఈ తల్లిని పూజించాలి. ధనసమృద్ధి, సత్కర్మలు చెయ్యడం, వివాహం కానివారికి వివాహయోగం ఈ అమ్మని కొలవడం వలన జరుగుతాయి. చిన్నపిల్లలకు మానసిక ఒత్తిడి తొలగుతుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది. శతృపీడ తొలగుతుంది.


expand_less