కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 24 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: పాడ్యమి రా. 6.52 కు తదుపరి విదియ
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: అనూరాధ ఉ. 9.58 కు తదుపరి జ్యేష్ఠ
యోగం: శివ ఉ. 11.22 కు తదుపరి సిద్ధ
కరణం: బాలవ ఉ. 07.27 కు తదుపరి కౌలవ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.18 - 09.11 కు & మ. 12.39 - 01.31 కు
వర్జ్యం: మ. 3.42 - 5.21 కు
అమృతకాలం: రా. 1.33 - 3.11 కు
సూర్యోదయం: ఉ. 5.42 కు
సూర్యాస్తమయం: సా. 6.44 కు
🕉️ శ్రీశ్రీశ్రీ కంచిపరమాచార్య వారి 131వ జయంతి🕉️
గురుబోధ
గురువు త్రిమూర్తులకు కూడా అతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడు అందుకే గురుః సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అమ్మవారికి కూడా గురుమూర్తిః అని ప్రత్యేక నామం లలితాసహస్రనామంలో ఉన్నది. సప్తమోక్షపురాలలో ఒకటైన కాంచీపురం కంచిపీఠానికి శంకరగురుపరంపరలో నడచేదైవమై అశేషభక్తులను తరింపజేసిన మహాగురువు, సద్గురువు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామివారు. అటువంటి పరమగురువును తలచుకొని, వారి ధర్మబోధలను విని ఆచరించడం మనందరి కర్తవ్యం. జయజయశంకర హరహరశంకర
https://youtu.be/nuaQpE4oGkw