May 24 2023మే 24 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 24 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : పంచమి రా. 01గం౹౹07ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : పునర్వసు మ. 01గం౹౹55ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : గండ సా. 05గం౹౹20ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  బవ మ. 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹31ని౹౹ నుండి 12గం౹౹23ని౹౹ వరకు
వర్జ్యం : రా. 10గం౹౹44ని౹౹ నుండి 12గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹17ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹24ని౹౹కు

గురుబోధ
కొందరికి ఎంత ప్రయత్నించినా వివాహం జరగదు. పెళ్ళి అయినా సంతానం ఉండదు. ఇటువంటి వారు జ్యేష్ఠ శుక్ల పంచమి నాడు పితృదేవతలను పూజిస్తే వివాహం జరుగుతుంది. పండితులైన పుత్రపుత్రికలు జన్మిస్తారు - (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)



expand_less