"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 24 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షము
తిథి : నవమి మధ్యాహ్నం 02గం౹౹45ని౹౹ వరకు తదుపరి దశమి
వారం :భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 02గం౹౹06ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభద్ర
యోగం : విష్కంభ ఈ రోజు రాత్రి 11గం౹౹41ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం : గరజి ఈ రోజు ఉదయం 10గం౹౹45ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & తదుపరి రాత్రి 10గం౹౹48ని౹౹ 11గం౹౹33ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 08గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹25ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 06గం౹౹15ని౹౹ నుండి 07గం౹౹49౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹24ని౹౹ వరకు
గురుబోధ:
గోవు నూతన గృహానికి అడుగుపెడితేనే గృహ వాస్తు దోషములు, గ్రహ దోషాలు ఉంటే తొలగుతాయే! మరి అంతటి గోవుకు సేవ చేయడం, సరైన ఆహారం అందించడం వల్ల ఎటువంటి పుణ్యము వస్తుందో ఆలోచించాలి!