కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 23 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: సప్తమి ఉ.10.27 కు తదుపరి అష్టమి 24 ఉ.9.07 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఆశ్లేష ఉ.7.29 కు తదుపరి మఘ 24 ఉ.6.51 కు
యోగం: వ్యాఘాత 24 తె.4:42 కు తదుపరి హర్షణ 25 తె.3:44 కు
కరణం: విష్టి సా.4:40 కు తదుపరి బాలవ 24 సా.4:24 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.29 - 8.20 కు
వర్జ్యం: రా.7.10 - 8.44 కు
అమృతకాలం: రా. 11.49 - 01.25 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.39 కు
గురుబోధ:
మతిమరుపు ఉన్న వారికి మళ్ళీ జ్ఞాపకశక్తి వచ్చి తెలివితేటలు పెరగాలి అంటే ప్రతిరోజు శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. చెంబుడు పాలతో, బిందెడు పాలతో లేక పంచపాత్రలో పోసిన పాలతో అభిషేకించి, అభిషేకించగా వచ్చిన ధారను ఒక పాత్రలో పట్టుకుని పూజ అయిపోయాక తీర్ధంగా తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి , తెలివితేటలు పెరుగుతాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial