May 23 2024మే 23 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 23 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: పూర్ణిమ సా. 6.37 కు తదుపరి పాడ్యమి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: విశాఖ ఉ. 8.52 కు తదుపరి అనూరాధ
యోగం: పరిఘ మ. 12.12 కు తదుపరి శివ
కరణం: విష్టి ఉ. 07.09 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.03 - 10.55 కు & మ. 03.16 - 04.08 కు
వర్జ్యం: మ. 1.03 - 2.43 కు
అమృతకాలం: రా. 11.05 - 12.45 కు
సూర్యోదయం: ఉ. 5.42 కు
సూర్యాస్తమయం: సా. 6.44 కు

🕉️ మహావైశాఖి, వైశాఖపూర్ణిమ, శ్రీ కూర్మావతార ఆవిర్భావతిథి, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మతిథి🕉️

గురుబోధ
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం నాడు పూర్ణిమ తిథి వచ్చినప్పుడు లక్ష్మీఆవిర్భావం, లక్ష్మీనారాయణుల వివాహఘట్టం వినడం సకలశుభప్రదం, సర్వసంపత్ప్రదాయకం.

https://www.youtube.com/watch?v=oIlCRzW-Qdc&list=PLfgDt5ZsV1JK7ZJl92EnRT2tjvDejx-oT

శ్లో|| వైశాఖ్యామపి పూర్ణాయాం, దానం సర్వస్వ సర్వదమ్|
ధర్మరాజ వ్రతం చాత్ర కథితం తన్నిశామయ||
వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైన పూర్ణిమ. ఈనాడు యమధర్మరాజును భక్తితో పూజించి నీటితో నింపిన పాత్రను శక్తిని బట్టి వెండి, రాగి లేక మట్టిది దానం చేసిన వారికి గోదానఫలం లభిస్తుంది. ధర్మజ్ఞానము కలుగుతుంది. అన్నదానం చేసిన వానికి భూదానఫలితం లభిస్తుంది. ఈ వ్రతాచరణ చేసినవాడు యముని చేత గౌరవింపబడతాడు.
వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మెుదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు ) అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఇవ్వబడింది.

expand_less