May 23 2023మే 23 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 23 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : చతుర్థి రా. 11గం౹౹23ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : ఆరుద్ర ఉ. 11గం౹౹42ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : శూల సా. 04గం౹౹47ని౹౹ వరకు తదుపరి గండ
కరణం :  వణిజ మ. 12గం౹౹04ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & రా. 10గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : రా. 12గం౹౹48ని౹౹ నుండి 02గం౹౹33ని౹౹ వరకు
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹23ని౹౹కు

🕉️భౌమ చతుర్థి🕉️

గురుబోధ
చతుర్థీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారకచతుర్థి లేదా భౌమచతుర్థి అంటారు. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేర్లతో పిలుస్తూ పూజిస్తే చాలా మంచిది. తీవ్రమైన కష్టాలలో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్నవారు, ఈ పవిత్రస్తోత్రం చేస్తే ఆ తీవ్ర కష్టాలు తొలగి సర్వపతనం అయిపోయినవారు కూడా మళ్ళీ ఉద్ధరింపబడుతారు. స్వగృహప్రాప్తి వంటి అపూర్వఫలితాలు అందించే ఈ స్తోత్రాన్ని మనసు చెదరకుండా శ్రద్ధతో చదివినా, విన్నా సకల శుభములు కలుగుతాయి. అమంగళం జరుగదు. పుత్రసంతానం కలిగి తీరుతుంది.




           
expand_less