"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 23 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షము
తిథి : అష్టమి సాయంత్రం 04గం౹౹12 తదుపరి నవమి
వారం :ఇందువారం (సోమవారం)
నక్షత్రం : శతభిషం రాత్రి 02గం౹౹35ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : వైధృతి ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 11గం౹౹34ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹49ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 07గం౹౹39ని౹౹ నుండి 09గం౹౹11ని౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹23ని౹౹
గురుబోధ:
ఆలయంలోని మూలవిరాట్ కంటె ఉత్సవమూర్తులకి శక్తి అధికంగా ఉంటుందని శాస్త్రం. అందుకే ఉత్సవమూర్తులకు జరిగే కల్యాణం, పల్లకీసేవ, అవభృతస్నానము, ఊరెరిగింపు మొ౹౹ ఉత్సవాలలో తప్పక కుటుంబసమేతంగా పాల్గొంటే సకలశుభాలు కలుగుతాయి.