May 22 2025మే 22 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 22 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి రా.10.27 కు తదుపరి ఏకాదశి 23 రా.8.16 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పూర్వాభాద్ర మ.1.46 కు తదుపరి ఉత్తరాభాద్ర 23 మ.12.27 కు
యోగం: విష్కంభ సా.8:49 కు తదుపరి ప్రీతి 23 సా.6:36 కు
కరణం: వణిజ మ.2.21 కు తదుపరి బవ 23 ఉ.11.55 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:03-10:55 కు, మ. 3:13-4:04 కు
వర్జ్యం: రా.10.50-12.20 కు
అమృతకాలం: ఉ.10:10 కు - 11:42 కు
సూర్యోదయం: ఉ. 5:31 కు
సూర్యాస్తమయం: సా. 6:21 కు

🕉️ హనుమాన్ జన్మతిథి, హనుమజ్జయంతి 🕉️

గురుబోధ:
హనుమ జన్మతిథి క్లుప్త పూజా విధానము:
హనుమంతుడంటే, రామచంద్రుడు అంటే నమ్మకం ఉన్న భక్తులంతా తెల్లవారుఝామునే లేవండి, తలారా స్నానం చేయండి (ఆరోగ్యం సహకరించిన వారు మాత్రమే). హనుమంతుడి ప్రతిమను పెట్టుకోండి, లేదా ఏదైనా పటమును పెట్టుకోండి. యథాశక్తిగా అర్చించండి. ఇంటిలో గంధ సిందూరం ఉంటే సిందూరంతో అర్చించండి, తమలపాకులు ఉంటే తమలపకులతో అర్చించండి.
ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనూమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః.....వంటి అష్టోత్తరశతనామములతో అర్చించండి, పూజించండి. అవకాశం ఉన్న వాళ్ళు మన్యుసూక్తం చదవగలిగిన వాళ్లు మన్యుసూక్తంతో హనుమంతుడ్ని అభిషేకించండి. ఏ పువ్వు దొరకకపోతే మనః పద్మం అంటే మీ మనసునే సమర్పించండి. దొరికితే అన్ని పువ్వులతో పూజించండి, సిందూరంతో, తమలపాకులతో పూజించండి. ఓం హరిమర్కటమర్కటాయ నమః ఇది పవిత్రమైన హనుమంతుని ద్వాదశాక్షరమంత్రము. ఈ పరమ పవిత్రమైన మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతో జపం చేసుకోండి.

https://youtu.be/KCvspNFxw4o?si=qXHgn9LisCU4QMoc
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-anjaneya-ashtottara-satanamamulu/

expand_less