కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి సా. 5.51 కు తదుపరి పూర్ణిమ
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: స్వాతి ఉ. 7.15 కు తదుపరి విశాఖ
యోగం: వరీయాన్ మ. 12.37 కు తదుపరి పరిఘ
కరణం: గరజి తె. 06.17 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.47 - 12.39 కు
వర్జ్యం: మ. 1.13 - 2.56 కు
అమృతకాలం: రా. 11.23 - 1.06 కు
సూర్యోదయం: ఉ. 5.42 కు
సూర్యాస్తమయం: సా. 6.44 కు
🕉️ వైశాఖ శుక్ల చతుర్దశి - నృసింహస్వామి ఆవిర్భావతిథి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మతిథి 🕉️
గురుబోధ
https://youtu.be/8oi3WWGoHHA
వైశాఖ శుక్ల చతుర్దశి శ్రీనృసింహచతుర్దశి. ఈ తిథినాడు నరసింహస్వామిని భక్తితో అర్చిస్తే ఏ విధమైన శత్రుపీడ ఉండదు. నృసింహ జయంతి రోజున ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. భక్తవత్సలుడైన శ్రీ నృసింహుడి జయంతి నాడు అందరం ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించి తరిద్దాం. నరసింహస్వామి వారు అహోబలంలో తొమ్మిదిమంది నారసింహులుగా మనకు దర్శనమిస్తారు.
ఈరోజు పారాయణం చేయవలసిన నృసింహ కరావలంబ స్తోత్రం గురుదేవులు మనకి అందించిన యూట్యూబ్ లింక్👇🏻👇🏻
https://youtu.be/3erOO4Yn_Hs