May 22 2023మే 22 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 22 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : తదియ రా. 09గం౹౹59ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : మృగశిర ఉ. 09గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం : ధృతి సా. 04గం౹౹34ని౹౹ వరకు తదుపరి శూల
కరణం :  తైతుల ఉ. 10గం౹౹40ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹49ని౹౹ వరకు
వర్జ్యం : రా. 06గం౹౹55ని౹౹ నుండి 08గం౹౹38ని౹౹ వరకు
అమృతకాలం : రా. 12గం౹౹56ని౹౹ నుండి 02గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹22ని౹౹కు


గురుబోధ
జ్యేష్ఠమాసానికి శ్రేష్ఠమాసం అని పేరు ఎందువలన వచ్చిందంటే జ్యేష్ఠమాసం ఉత్తరాయణం కాలంలో సుముహూర్తాలు ఉండే మాసములలో చివరి మాసం (మూఢమి వస్తే లెక్కలోకి రాదు). దేవాలయాల ప్రతిష్ఠలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతున్న చిట్టచివరి మాసం అని భీష్ముని వంటి వారు చెప్పారు. అటువంటి అపూర్వ మాసంలో శ్రీమన్నారాయణుడిని, పరమశివుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. యథాశక్తి దానధర్మాలు చేయడం సకల పాపహరం.

           
expand_less