కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 21 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి మ.2.09 కు తదుపరి షష్ఠి 22 మ.12.10 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పునర్వసు ఉ.9.44 కు తదుపరి పుష్యమి 22 ఉ.8.28 కు
యోగం: వృద్ధి ఉ.8:18 కు తదుపరి ధ్రువ 22 ఉ.6:13 కు
కరణం: కౌలవ రా.7:21 కు తదుపరి గరజి 22 సా.5:39 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.04 - 10.55 కు, మ. 3.13 - 4.04 కు
వర్జ్యం: సా.5.19 - 6.50 కు
అమృతకాలం: రా. 08.47 - 10.17 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.39 కు
గురుబోధ:
🕉️కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవ పరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.
🕉️సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. వారు ప్రత్యేక పూజలు, జపములు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial