May 21 2025మే 21 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 21 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి రా.12.27 కు తదుపరి దశమి 22 రా.10.27 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శతభిషం మ.2.50 కు తదుపరి పూర్వాభాద్ర 22 మ.1.46 కు
యోగం: వైధృతి రా.12:34 కు తదుపరి విష్కంభ 22 రా.8:49 కు
కరణం: తైతుల సా. 4:13 కు తదుపరి వణిజ 22 మ.2.21 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:46-12:38 కు
వర్జ్యం: రా.8.57-10.28 కు
అమృతకాలం: మ.11.56-01.30 కు
సూర్యోదయం: ఉ. 5:31 కు
సూర్యాస్తమయం: సా. 6:21 కు

గురుబోధ:
చాలా ప్రసిద్ధమైన దుఃఖక్షయకర, కార్యసిద్ధి మంత్రశ్లోకాల సంపుటీకరణ
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ |
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||
ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
హనుమంతుడిని ఎంత పూజించినా రాముడిని పూజించకపోతే ఆయనకు బాధ కలుగుతుంది. రాముడి నామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. హనుమాన్ జన్మ తిథిని పురస్కరించుకొని శ్రీరామ జయ రామ జయజయ రామ అని రామ నామము చేయండి. హనుమాన్ చాలీసాను వంద సార్లు పారాయణ చేస్తే వాడు జైలు నుండి కూడా బయటకు వస్తాడు, వాడు మహా సుఖం పొందుతాడు, వాడికి శివుడి సాక్షిగా సిద్ధి కలుగుతుంది.

https://youtu.be/m-v_wPwqRTE?si=qiEaTSNz6tKqJ84y

expand_less